Sarkar Express: ఆగిన సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-05-13T11:00:53+05:30 IST

మీంజూరు సమీపంలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌(Sarkar Express) ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల్లో ఒకొంత భయాందోళన ఏర్పడింది.

Sarkar Express: ఆగిన సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు విషయం ఏంటంటే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మీంజూరు సమీపంలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌(Sarkar Express) ఇంజన్‌లో లోపం తలెత్తడంతో గుమ్మిడిపూండి - చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాకినాడ నుండి చెన్నై(Kakinada to Chennai)కి వస్తున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం వేకువజాము నాలుగు గంటలకు పొన్నేరి స్టేషన్‌ దాటిన తర్వాత మీంజూరుకు చేరువగా ఇంజన్‌లో లోపం ఏర్పడటంతో ఆగింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న రైళ్లన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు రైల్వే ఇంజనీరింగ్‌ నిపుణులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఇంజన్‌ను మరమ్మతు చేయడానికి ప్రయత్నించారు. గంట సేపు దాటినా మరమ్మతులు పూర్తికాకపోవడంతో ఆ రైలును నెమ్మదిగా మీంజూరు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగాయి.

Updated Date - 2023-05-13T11:00:53+05:30 IST