Share News

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి సేఫ్‌గా వచ్చిన రెండో ఫ్లైట్.. ఆపరేషన్ అజయ్ సక్సెస్‌పై జైశంకర్ హర్షం

ABN , First Publish Date - 2023-10-14T12:44:05+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్(Israeil-Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన 447 మంది భారతీయులను(Indians) 'ఆపరేషన్ అజయ్'(Operation Ajay) కింద తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి.

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి సేఫ్‌గా వచ్చిన రెండో ఫ్లైట్.. ఆపరేషన్ అజయ్ సక్సెస్‌పై జైశంకర్ హర్షం

ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్(Israeil-Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన 447 మంది భారతీయులను(Indians) 'ఆపరేషన్ అజయ్'(Operation Ajay) కింద తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. 212 మందితో టెల్‌ అవీవ్‌(Tel Aviv)లోని బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం ఆరు గంటల ప్రయాణం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. తాజాగా 235 మంది ప్రయాణికులతో వచ్చిన రెండో విమానం శనివారం ఢిల్లీలో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ప్రయాణికులు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారిని స్వదేశానికి సేఫ్ గా తీసుకురావడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్(Jaishankar) హర్షం వ్యక్తం చేశారు.


ఢిల్లీ విమానాశ్రయంలో భారతీయ పౌరులకు స్వాగతం పలికిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. "ఆపరేషన్ అజయ్ కొనసాగిస్తాం. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం" అని వెల్లడించారు. రెండో ఫ్లైట్‌లో ఎక్కువగా 135 మంది విద్యార్థులు, ఇద్దరు శిశువులు ఉన్నట్లు చెప్పారు. ఆ దేశం నుంచి తాము తిరిగి వస్తామో? లేదో?భయాలు నెలకొన్నాయని.. ఆ టైంలో భారత్ చేసిన ఆపరేషన్ తో తామంతా తిరిగి వచ్చామని.. ఇందుకు కృషి చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. అక్కడ భయంకర పరిస్థితులు నెలకొన్నాయని.. తాము ప్రాణాలపై ఆశ వదిలేసుకున్న టైంలో భారత ప్రభుత్వం తమ రక్షణ కోసం చర్యలు చేపట్టిందని మరో ప్రయాణికుడు అన్నాడు. ఇజ్రాయెల్ - పాలస్థీనా మధ్య ఉద్రిక్తతలు చల్లారేవరకు ఆపరేషన్ అజయ్ కొనసాగించాలని కోరాడు.

Updated Date - 2023-10-14T12:44:59+05:30 IST