Rajya Rani Express: మహిళా సిబ్బందితో నడిచిన రైలు

ABN , First Publish Date - 2023-03-09T13:20:53+05:30 IST

నైరుతి రైల్వేజోన్‌కు చెందిన బెంగళూరు డివిజన్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వినూత్నంగా నిర్వ

Rajya Rani Express: మహిళా సిబ్బందితో నడిచిన రైలు

- వినూత్నంగా బెంగళూరు-మైసూరు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నైరుతి రైల్వేజోన్‌కు చెందిన బెంగళూరు డివిజన్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వినూత్నంగా నిర్వహించారు. మొత్తం మహిళా సిబ్బందితోనే బెంగళూరు-మైసూరు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలును నడిపారు. అదనపు రైల్వే మేనేజర్‌ కుసుమ హరిప్రసాద్‌ ఈ మహిళా స్పెషల్‌ రైలుకు మెజస్టిక్‌లోని సిటీ రైల్వేస్టేషన్‌లో పచ్చజెండా చూపారు. మహిళా పాయింట్స్‌ మ్యాన్‌లు జె.ఫాతిమా, సరస్వతి, స్టేషన్‌ మాస్టర్‌ ప్రతిమా శర్మ, ఎలక్ట్రికల్‌ విభాగం సీనియర్‌ ఇంజనీర్‌ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రైలుకు అభిరామి లోకోపైలెట్‌గానూ, గాయత్రి కృష్ణన్‌ సహాయ లోకో పైలెట్‌గానూ శైలజ గార్డ్‌గానూ విధులు నిర్వహించారు. రైల్వే సురక్ష తా టీమ్‌లో ఛాయామణి, శిల్పా, ఎస్‌.హరతి మీనా, విజయలక్ష్మి, పార్ధిభాసింగ్‌, ఎం.విద్యా పాల్గొన్నారు. ఇక టికెట్‌ కలెక్టర్లుగా పీఎస్‌ ఉమా, మీనాక్షి దేవి, రమాహంస, టీనా జోసెఫ్‌, సోనా, సీఎస్‌ భారతి విధులు నిర్వహించారు. బెంగళూరు-మైసూరు మార్గంలోని అన్ని రైల్వేస్టేషన్లలోనూ మహిళా సిబ్బందికి అపూర్వ స్వాగతం లభించింది. ప్రయాణికులు పెద్దసంఖ్యలో మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-03-09T13:20:53+05:30 IST