Rajinikanth: కావేరి వివాదంపై రజనీకాంత్ ‘నో కామెంట్‌’

ABN , First Publish Date - 2023-10-04T08:09:29+05:30 IST

కావేరీ జలాల వివాదంపై స్పందించేందుకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) నిరాకరించారు. లైకా చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో

Rajinikanth: కావేరి వివాదంపై రజనీకాంత్ ‘నో కామెంట్‌’

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కావేరీ జలాల వివాదంపై స్పందించేందుకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) నిరాకరించారు. లైకా చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీ నటించనున్న 170వ చిత్రం షూటింగ్‌ కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. ఆ షూటింగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తూ మంగళవారం ఉదయం ఆయన మీనంబాక్కం విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘జైలర్‌’ చిత్రం ఊహించనంత ఘనవిజయం సాధించిందని చెప్పారు. ఇక తాను నటించనున్న 170వ చిత్రం సమాజానికి చక్కటి సందేశం ఇచ్చేలా ఉంటుందన్నారు. ఈ చిత్రం టైటిల్‌ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. ఇదే విధంగా తన 171వ చిత్రం కూడా ప్రేక్షకులకు నచ్చేరీతిలో ఉంటుందన్నారు. చివరగా కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కావేరి జలాలను విడుదల చేయకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘నో కామెంట్‌’ అంటూ నవ్వుతూ నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2023-10-04T08:09:29+05:30 IST