Rajinikanth: బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన జైలర్.. విషయం ఏంటంటే...

ABN , First Publish Date - 2023-09-21T10:15:27+05:30 IST

స్వదేశంలో జరుగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీలను తిలకించేందుకు వీలుగా భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తనకు

Rajinikanth: బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన జైలర్.. విషయం ఏంటంటే...

అడయార్‌(చెన్నై): స్వదేశంలో జరుగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీలను తిలకించేందుకు వీలుగా భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) తనకు గోల్డెన్‌ టిక్కెట్‌ ఇవ్వడం పట్ల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) కృతఙ్ఞతలు తెలిపారు. ఇదేవిషయంపై ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఈ ప్రపంచ కప్‌ పోటీలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా గోల్డెన్‌ టిక్కెట్‌ను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ(BCCI)కు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రియమైన జైషా.. మిమ్మలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ వ్యాఖ్యలకు, ఆలోచనలకు ధన్యవాదాలు’ అని అన్నారు.

Updated Date - 2023-09-21T10:15:27+05:30 IST