Share News

Rains: బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి.. 28 వరకు తేలికపాటి వర్షాలకు అవకాశం

ABN , Publish Date - Dec 24 , 2023 | 08:07 AM

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విషయంపై చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటన విడుదల చేసింది.

Rains: బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి.. 28 వరకు తేలికపాటి వర్షాలకు అవకాశం

- వాతావరణ శాఖ వెల్లడి

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విషయంపై చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బాహ్య ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌లలో తేలికపాటి వర్షపు జల్లులు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వేకువజామున మంచు ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదవుతుందని పేర్కొంది. అదేవిధంగా కన్నియాకుమారి సముద్రతీరంతో పాటు అండమాన్‌, లక్ష్యదీప్‌ ప్రాంతాల్లో గంటలు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో సముద్రపు గాలులు వీస్తాయని, కొన్ని సమయాల్లో ఈ గాలుల వేగం 55 కిమీ వరకు చేరుతాయని తెలిపింది.

Updated Date - Dec 24 , 2023 | 08:07 AM