Alert: కేదార్‌నాథ్ థాం యాత్రకు బ్రేక్...ఐఎండీ హెచ్చరిక జారీ

ABN , First Publish Date - 2023-05-02T08:26:46+05:30 IST

ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేదార్‌నాథ్ థాం యాత్రకు ఆటంకం కలిగింది....

Alert: కేదార్‌నాథ్ థాం యాత్రకు బ్రేక్...ఐఎండీ హెచ్చరిక జారీ
Kedarnath Dham Pilgrims

కేదార్‌నాథ్: ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేదార్‌నాథ్ థాం యాత్రకు ఆటంకం కలిగింది. భారత వాతావరణ శాఖ (IMD) కేదార్‌నాథ్ ధామ్ మార్గంలో భారీ హిమపాతం గురించి హెచ్చరిక జారీ చేసింది.(Rain, Snowfall Alert Issued) ఈ వారంలో కేదార్‌ఘాటిలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.హిమాలయాల్లో భారీవర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉన్నందున రానున్న రెండు మూడు రోజుల్లో కేదార్‌నాథ్ ధామ్ సందర్శనకు వచ్చే యాత్రికులు(Kedarnath Dham Pilgrims) అప్రమత్తంగా ఉండాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ కోరారు.

ప్రస్తుతం కేదార్‌నాథ్ ధామ్‌లో నిరంతరం మంచు కురుస్తోందని, దీంతో సోన్‌ప్రయాగ్ నుంచి ఉదయం 10:30 గంటల తర్వాత కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు ప్రయాణికులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.,‘‘ప్రయాణికులందరూ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం జారీ చేసిన

Updated Date - 2023-05-02T08:26:46+05:30 IST