ఒడిశా రైలు ప్రమాద బాధితులకు జైళ్లో ఉండి రూ.10 కోట్లు సాయం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్.. రైల్వేశాఖ తర్జన భర్జన.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2023-06-16T16:32:41+05:30 IST

న్యాయంగా సంపాదించిన డబ్బుల నుంచే ఈ 10 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా జత చేసి పంపించాడు. తన విరాళం డీడీ ద్వారా పంపేందుకు వివరాలు అందజేయాలని లాయర్ ద్వారా రైల్వే శాఖకు సుకేశ్ విజ్ఞప్తి చేశాడు. కానీ సుకేశ్ విరాళాన్ని అంగీకరించాలో లేదో తెలియక

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు జైళ్లో ఉండి రూ.10 కోట్లు సాయం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్.. రైల్వేశాఖ తర్జన భర్జన.. ఎందుకంటే..!
Sukesh chandrasekhar

ఢిల్లీ: యావత్తు దేశంతో పాటు ప్రపంచ దేశాలను చలింపజేసిన ఒడిశా రైలు ప్రమాద (Odisha train accident) ఘటన ఎవ్వరూ మరిచిపోలేని విషాదం. మూడు రైళ్లు ఢీకొని దాదాపు 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాద దృశ్యాలను చూసిన వాళ్లంతా అయ్యో.. పాపం అనకుండా మానరు. అంత దారుణంగా ఈ ఘోరంగా జరిగింది. అటు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకున్నాయి. అంతేకాకుండా మరికొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి దాతృత్వం చాటాయి. సెలబ్రటీలు, మానవత్వం ఉన్నవాళ్లంతా ఎవరి సామర్థ్యం మేరకు సాయం చేసి బాధితులకు అండగా నిలిచారు. తాజాగా ఈ జాబితాలో మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్‌ కూడా చేరారు. బాధితులకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ సాయం కేంద్ర రైల్వే మంత్రికి ధర్మ సంకటంగా మారింది. దాదాపు రూ.10 కోట్లు తన వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ ఆ విరాళాన్ని తీసుకోవాలా? వద్దా? అన్న సందిగ్ధంలో కేంద్ర రైల్వే శాఖ సతమతమవుతోంది. తీసుకుంటే ఎలాంటి విమర్శలు మూటగట్టుకోవాలన్న భయంతో తర్జన భర్జన పడుతోంది.

ఒడిశా రైల్వే ప్రమాద బాధితుల కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చేందుకు మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh chandrasekhar) ముందుకొచ్చాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రికి (Railway ministry) లాయర్ ద్వారా సమాచారం పంపించాడు. తాను న్యాయంగా సంపాదించిన డబ్బుల నుంచే ఈ 10 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా జత చేసి పంపించాడు. తన విరాళం డీడీ ద్వారా పంపేందుకు వివరాలు అందజేయాలని లాయర్ ద్వారా రైల్వే శాఖకు సుకేశ్ విజ్ఞప్తి చేశాడు. కానీ సుకేశ్ విరాళాన్ని అంగీకరించాలో లేదో తెలియక కేంద్ర రైల్వే శాఖ... న్యాయశాఖ సలహా కోరినట్లు తెలుస్తోంది.

రైల్వేశాఖకు సుకేశ్ రాసిన లేఖలో ఏముంది అంటే..

ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారి కోసం రూ. 10 కోట్ల విరాళాన్ని అందిస్తానంటూ లేఖ రాశారు. తన వ్యక్తిగత నిధుల నుంచి పన్ను చెల్లించిన రూ.10 కోట్లను విరాళంగా స్వీకరించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఒడిశా రైలు ప్రమాదం దురదృష్టకర దుర్ఘటన అని.. తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవడం గర్వంగా ఉందని చెప్పారు. రూ.10 కోట్లను బాధిత కుటుంబాల పిల్లుల విద్యా ఖర్చుల కోసం వినియోగించాల్సిందిగా అభ్యర్థించాడు. ప్రతిరోజూ తన సంస్థలు శారద ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్లు పేదల కోసం పనిచేస్తున్నాయని వివరించాడు. రైలు ప్రమాద ఘటనలో నిరుపేదలకు సాయం చేయడం ఒక మంచి పౌరుడిగా.. ఆర్థిక సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా తన బాధ్యత అని గుర్తుచేశారు. రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని అంగీకరించమని లేఖలో కోరాడు. విరాళం ఎలా అందజేయాలో తెలియజేయాలని రైల్వేశాఖను సుకేశ్ వేడుకున్నాడు. కాగా మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

అయితే సుకేశ్ లేఖపై కేంద్ర రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మానవత దృక్పథంతో ఆలోచిస్తుందా? లేదంటే అవినీతిపరుడిగా ముద్ర వేసి విరాళాన్ని తిరస్కరిస్తుందో వేచి చూడాలి.

sdkd.gif

Updated Date - 2023-06-16T16:44:02+05:30 IST