Rishi Sunak : ‘గర్వించే హిందువులు’ రుషి సునాక్, అక్షత ఢిల్లీ దేవాలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-09-10T10:14:28+05:30 IST

జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తాను గర్వించే హిందువునని చెప్పారు.

Rishi Sunak : ‘గర్వించే హిందువులు’ రుషి సునాక్, అక్షత ఢిల్లీ దేవాలయంలో ప్రత్యేక పూజలు
Akshata Murthy , Rishi Sunak

న్యూఢిల్లీ : జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తాను గర్వించే హిందువునని చెప్పారు. న్యూఢిల్లీలో ఉన్న సమయంలో తాను ఓ దేవాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.

రుషి సునాక్, అక్షత మూర్తి దంపతులు ఆదివారం ఉదయం అక్షరధామ్ దేవాలయంలో దాదాపు ఓ గంటసేపు గడిపారు. ఈ దేవాలయం డైరెక్టర్ జ్యోతీంద్ర దవే మాట్లాడుతూ, రుషి సునాక్ హిందూ సంప్రదాయాలను పాటిస్తూ, భగవంతుడిని దర్శించుకున్నారని చెప్పారు. దేవాలయం ప్రాంగణంలో పాదరక్షలు లేకుండా నడుస్తూ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారన్నారు. ఆయన సనాతన ధర్మానికి చాలా సన్నిహితుడనే విషయాన్ని ఆయనను కలిసిన తర్వాత అర్థమైందని తెలిపారు. ఆయన అంతకుముందు తమను సంప్రదించారని, ఏ సమయంలో రావచ్చు? అని అడిగారని, ‘‘మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి’’ అని చెప్పామని తెలిపారు. దేవాలయంలో ఆయన సతీ సమేతంగా పూజలు చేశారని, హారతి ఇచ్చారని తెలిపారు. దేవీదేవతలందరికీ పుష్పాలు సమర్పించారని తెలిపారు. దేవాలయంలోని సాధువులందరితోనూ మాట్లాడారని చెప్పారు.

దేవాలయంలోని ప్రతి అంశాన్నీ తాము వారికి వివరించామన్నారు. ఈ దేవాలయం నమూనాను వారికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ప్రతి క్షణం ఆయన చాలా ఆనందంగా గడిపారని చెప్పారు. అక్షత కూడా చాలా సంతోషించారన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ తాను ఈ దేవాలయాన్ని సందర్శిస్తానని చెప్పారని తెలిపారు.

రుషి, అక్షత దంపతులు ఈ దేవాలయానికి రావడానికి ముందే ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


రుషి శుక్రవారం మాట్లాడుతూ, తాను రక్షా బంధన్ పండుగ చేసుకున్నానని, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోలేకపోయానని, అందువల్ల ఢిల్లీలో ఓ దేవాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. తాను గర్వించే హిందువునని, తనను అలాగే పెంచారని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?

CID On NCBN Remand Report : చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఏయే విషయాలు చెప్పింది.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్ క్లూజివ్

Updated Date - 2023-09-10T10:14:28+05:30 IST