Vande Bharat trains: 5 వందే భారత్ రైళ్లను ఈనెల 27న ప్రారంభించనున్న మోదీ

ABN , First Publish Date - 2023-06-17T19:56:38+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 27న ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల''ను ) ప్రారంభించనున్నారు. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్, బెంగళూరు-హిబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Vande Bharat trains: 5 వందే భారత్ రైళ్లను ఈనెల 27న ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 27న ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల''ను (Vande Bharat Express trains) ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సిటీలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లను మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఐసీఎఫ్ నిర్మించింది. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్, బెంగళూరు-హిబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టే ఐదు రైళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది.

సౌకర్యవంతమైన సీట్లు, అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించిన వందేభారత్ రైళ్లతో వివిధ నగరాల అనుసంధానం జరగడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అదనపు రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థికావృద్ధి కూడా జరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. దేశీయంగా వందేభారత్ రైళ్ల తయారీతో దేశ మ్యాన్యుఫ్యాక్టరింగ్ రంగం కూడా పురోగతి బాట పట్టనుంది.

Updated Date - 2023-06-17T21:04:14+05:30 IST