PM Modi: ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ శుభవార్త

ABN , First Publish Date - 2023-05-23T15:38:02+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. త్వరలో బ్రిస్బేన్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు కూడా పెంచుతామన్నారు. గత పదేళ్లలో భారత్ సాధించిన పురోగతి, భారతదేశ గొప్పదనాన్ని మోదీ ప్రవాసులకు వివరించారు.

PM Modi: ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ శుభవార్త

సిడ్నీ: ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) ప్రవాస భారతీయుల(NRI)నుద్దేశించి ప్రసంగించారు. త్వరలో బ్రిస్బేన్‌(Brisbane)లో భారత రాయబార కార్యాలయం(Embassy of India) ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు కూడా పెంచుతామన్నారు. గత పదేళ్లలో భారత్ సాధించిన పురోగతి, భారతదేశ గొప్పదనాన్ని మోదీ ప్రవాసులకు వివరించారు. భారత ఆర్థికవ్యవస్థ(The economy of India) వేగంగా ఎదుగుతోందని, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని అంతా కోరుకుంటున్నారని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రజాస్వామ్యానికి(democracy) భారత్(India) తల్లి లాంటిదని, ప్రపంచ మేలు కోసం కూడా భారత్ కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. ‘వసుదైక కుటుంబం’ అన్నది భారత్ నినాదమని, మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంలా చూస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు వ్యాక్సిన్లు అందజేయడం గర్వంగా ఉందని మోదీ అన్నారు. పాల ఉత్పత్తిలో భారత్‌ నెం.1 గా విస్తరించిందని, ప్రజాపంపిణీ వ్యవస్థ మరింత బలపడిందన్నారు. గత 9 ఏళ్లలో 500 మిలియన్ బ్యాంక్ ఖాతాలు తెరిచాం: మోదీభారత్‌లో నైపుణ్యానికి కొదవలేదన్న ప్రధాని..భారత్‌లోని ఫిన్‌టెక్ విప్లవాన్ని ప్రపంచమంతా చూస్తోందని ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు వివరించారు.

Updated Date - 2023-05-23T15:41:02+05:30 IST