New Year : రాష్ట్రపతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-01-01T12:32:22+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ

New Year : రాష్ట్రపతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు
Narendra Modi, Draupadi Murmu

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023వ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదిలావుండగా, ప్రజలు భగవంతుని ఆశీర్వాదాల కోసం దేవాలయాలను సందర్శిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఇచ్చిన ట్వీట్‌లో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశవిదేశాల్లోని భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2023వ సంవత్సరం మన జీవితాల్లో కొత్త ఆకాంక్షలు, లక్ష్యాలు, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. దేశ సమ్మిళిత అభివృద్ధి, సమగ్రత, ఐకమత్యం కోసం మనమంతా పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన ట్వీట్‌లో, 2023వ సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఈ సంవత్సరమంతా నూతన ఆశలు, సంతోషం, విజయం లభించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.


ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) ఇచ్చిన ట్వీట్‌లో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు గొప్ప శక్తి, సామర్థ్యాలతో మన ప్రయత్నాలను కొనసాగించడానికి ఈ సంతోషకరమైన సందర్భ ఓ అవకాశమని పేర్కొన్నారు. అభివృద్ధి, సౌభాగ్యాల్లో భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే దృఢసంకల్పంతో నూతన సంవత్సరంలో అడుగు పెడదామన్నారు. 2023కు స్వాగతం పలికారు.

Updated Date - 2023-01-01T12:33:58+05:30 IST