Share News

Premalatha: ‘కెప్టెన్‌’ ఆశయాలు కొనసాగిద్దాం: ప్రేమలత

ABN , Publish Date - Dec 30 , 2023 | 08:28 AM

‘కెప్టెన్‌’ మన మధ్య నుంచి వెళ్లిపోయినా, ఆయన ఆత్మ మనతోనే ఉంటుందని, ఆయన ఆశయాలు కొనసాగిద్దామని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌(Premalatha Vijayakanth) పిలుపునిచ్చారు.

Premalatha: ‘కెప్టెన్‌’ ఆశయాలు కొనసాగిద్దాం: ప్రేమలత

చెన్నై: ‘కెప్టెన్‌’ మన మధ్య నుంచి వెళ్లిపోయినా, ఆయన ఆత్మ మనతోనే ఉంటుందని, ఆయన ఆశయాలు కొనసాగిద్దామని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌(Premalatha Vijayakanth) పిలుపునిచ్చారు. స్థానిక కోయంబేడులోని పార్టీ కార్యాలయం ప్రాంగణంలో అశేష అభిమానుల మధ్య పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్‌ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కార్యక్రమం అనంతరం ప్రేమలత మాట్లాడుతూ... పార్టీ కార్యాలయంలో స్థలం తక్కువగా ఉండడంతో కొద్దిమందిని మాత్రమే అనుమతించామన్నారు. కెప్టెన్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు. కెప్టెన్‌కు నివాళి అర్పించేందుకు వచ్చిన అన్ని పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కెప్టెన్‌ దానగుణం, మంచితనం వల్లే ఆయన అంతిమయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారని అన్నారు. ఆయన ఏ ఆశయాలతో పార్టీ స్థాపించారో, ఆ ఆశయాల సాధనకు అందరం కలసి కట్టుగా పాటుపడదామంటూ ప్రేమలత శపథం చేశారు.

Updated Date - Dec 30 , 2023 | 08:28 AM