Modi overnight stay: వివేకానంద పర్యటించిన ఆశ్రమంలో మోదీ రాత్రి బస.. 122 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి..!

ABN , First Publish Date - 2023-10-03T21:00:28+05:30 IST

ఉత్తరాఖండ్‌ చంపావత్‌ జిల్లా లోహ్‌గాట్ ప్రాంతంలోని ప్రఖ్యాత అద్వైత ఆశ్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాత్రి బస చేయనున్నారు. ఈ ఆశ్రమంలో 1901లో స్వామి వివేకానంద బస చేశారు. అప్పట్నించి 122 ఏళ్ల ఆశ్రమ చరిత్రలో ఏ ఒక్క నేతను ఇందులో బస చేయడానికి యాజమాన్యం అనుమతించ లేదు.

Modi overnight stay: వివేకానంద పర్యటించిన ఆశ్రమంలో మోదీ రాత్రి బస.. 122 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి..!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ (Uttarakhand) చంపావత్‌ జిల్లా లోహ్‌గాట్ ప్రాంతంలోని ప్రఖ్యాత అద్వైత ఆశ్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రాత్రి బస (overnight stay) చేయనున్నారు. ఈ ఆశ్రమంలో 1901లో స్వా్మి వివేకానంద బస చేశారు. అప్పట్నించి 122 ఏళ్ల ఆశ్రమ చరిత్రలో ఏ ఒక్క నేతను ఇందులో బస చేయడానికి యాజమాన్యం అనుమతించ లేదు. మోదీ అక్టోబర్ 11,12 తేదీల్లో రెండ్రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ రాత్రి ఆయన అద్వైత ఆశ్రమానికి చెందిన ప్రధాన ఆశ్రమంలో బస చేస్తారు.


అద్వైత ఆశ్రమాన్ని మాయావతి ఆశ్రమంగా పిలుస్తుంటారు. చంపావత్ జిల్లా ప్రధాన కార్యాలయానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉంది. 6,400 అడుగల ఎత్తులో ఈ ఆశ్రమం ఉంది. చుట్టూ పచ్చటి అడవులున్నాయి. స్వా్మి వివేకానంద 1901 జనవరి 3వ తేదీ నుంచి 18 వరకూ పక్షం రోజుల పాటు ఇక్కడ బస చేశారు.


తొలి వీవీఐపీ..

కాగా, ప్రధానమంత్రి మోదీ రెండ్రోజుల పర్యటనలో భాగంగా తమ ప్రధాన ఆశ్రమంలో బస చేయనున్నట్టు మాయావతి ఆశ్రమానికి చెందిన స్వామి సుద్ధిదానంద తెలిపారు. 1901లో స్వామి వివేకానంద తర్వాత ఆశ్రమ ప్రధాన భవంతిలో ఆతిథ్యం పొందనున్న తొలి వీవీఐపీ మోదీనేనని చెప్పారు. తమ ఆశ్రమాన్ని సందర్శిస్తున్న తొలి ప్రధాని మోదీ కావడంతో ఆయనకు ఆశ్రమ యాజమాన్యం సాదర స్వాగతం పలుకుతుందని తెలిపారు.

Updated Date - 2023-10-03T21:00:28+05:30 IST