Union Budget 2023 : బడ్జెట్ సమావేశాల ముందు మోదీ కీలక చర్చలు

ABN , First Publish Date - 2023-01-13T15:00:49+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించేందుకు

Union Budget 2023 : బడ్జెట్ సమావేశాల ముందు మోదీ కీలక చర్చలు
Narendra Modi, Nirmala Sitharaman

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో శుక్రవారం నీతీ ఆయోగ్ (NITI Aayog) కార్యాలయంలో చర్చలు జరిపారు. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించడానికి ముందు ఈ కసరత్తు జరిగింది. దేశ ఆర్థిక పరిస్థితులపై వీరితో చర్చించినట్లు తెలుస్తోంది.

దేశ ఆర్థికాభివృద్ధి రేటు 7 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వృద్ధిని పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా మోదీ, నిర్మల సీతారామన్ చర్చిస్తారని సమాచారం. ఈ కీలక సమావేశాల్లో వివిధ శాఖల మంత్రులు కూడా పాల్గొంటారు.

2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితమవుతుందని గత వారం విడుదలైన నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నివేదిక అంచనా వేసింది. డిమాండ్ బలహీనపడటంతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మందగిస్తుందని, 7 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను మన దేశం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - 2023-01-13T15:00:54+05:30 IST