Bihar:సినిమాహాలు బయట ‘పఠాన్’ పోస్టర్ల దహనం

ABN , First Publish Date - 2023-01-25T08:13:43+05:30 IST

బీహార్‌ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లోని సినిమా హాలులో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చింపి తగులబెట్టారు...

Bihar:సినిమాహాలు బయట ‘పఠాన్’ పోస్టర్ల దహనం
Pathaan Posters Torn Burnt

భాగల్‌పూర్(బీహార్): బీహార్‌ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లోని సినిమా హాలులో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చింపి తగులబెట్టారు.(Pathaan Posters) భాగల్‌పూర్‌లోని దీప్‌ప్రభ సినిమా హాల్‌లో షారూఖ్‌ఖాన్ ‘పఠాన్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. హిందూ సంస్థల యువకులు సినిమా హాలులో(Cinema Halls) ఉన్న పోస్టర్లను చించి, దహనం చేశారు.(Torn, Burnt) ‘‘ఫిల్మ్ చలేగా హాల్ జలేగా’’ అంటూ నినాదాలు చేస్తూ పోస్టర్లకు నిప్పంటించారు.తాము హిందూత్వంతో రాజీపడబోమని, సనాతన సంస్కృతిని వ్యతిరేకించే ఏ అంశాన్ని సహించబోమని హిందూ సంస్థల కార్యకర్తలు హెచ్చరించారు.

బీహార్ రాష్ట్రంలోని (Bihar)భాగల్‌పూర్‌లోని(Bhagalpur) ఏదైనా థియేటర్లలో పఠాన్‌ సినిమాను ప్రదర్శిస్తే, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని హిందూ సంస్థల సభ్యులు తెలిపారు. కొందరు సంఘ వ్యతిరేకులు సినిమాను వ్యతిరేకిస్తూ పోస్టర్‌ను తగలబెట్టారని సినిమా హాలు మేనేజర్ లాలన్ సింగ్ తెలిపారు. దీనిపై తాను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశామని, భద్రత కల్పిస్తామని పాలనాధికారి హామీ ఇచ్చారని తెలిపారు. రైట్‌వింగ్ కార్యకర్త సత్యరంజన్ బోరా గీతానగర్ పోలీస్ స్టేషన్‌లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘‘బేషరమ్ రంగ్’’ పాట విడుదలైన తర్వాత పఠాన్ సినిమా వివాదంలో పడింది.మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా బేషరమ్ రంగ్ అనే సినిమా పాటల్లో డ్రెస్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది.విశ్వహిందూ పరిషత్ (VHP)లో భాగమైన భజరంగ్ దళ్ సభ్యులు సినిమా ప్రమోషన్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని వస్త్రపూర్‌లోని ఆల్ఫా వన్ మాల్‌లో రచ్చ సృష్టించారు.ఈ సినిమాను విడుదల చేస్తే మరింత ఉధృతంగా నిరసనలు తెలుపుతామని ఆందోళనకారులు మాల్ అథారిటీని బెదిరించారు.

Updated Date - 2023-01-25T08:37:25+05:30 IST