Share News

Pak boat apprehended: ఐసీజీఎస్ అరింజయ్‌తో ఛేజ్.. పాక్ బోటు స్వాధీనం

ABN , First Publish Date - 2023-11-22T15:59:31+05:30 IST

భారత ప్రాదేశిక జలాల్లో అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ 'నజ్-రె-కరమ్'ను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అందులోని 13 మంది సిబ్బందిని అదుపులోనికి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న పడవను గుజరాత్‌లోని ఓక్హా తీసుకువచ్చి, సిబ్బందిని ఇంటరాగేట్ చేస్తున్నారు.

Pak boat apprehended: ఐసీజీఎస్ అరింజయ్‌తో ఛేజ్.. పాక్ బోటు స్వాధీనం

అహ్మదాబాద్: భారత ప్రాదేశిక జలాల్లో అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ 'నజ్-రె-కరమ్' (Naz-Re-Karam)ను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అందులోని 13 మంది సిబ్బందిని అదుపులోనికి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న పడవను గుజరాత్‌లోని ఓక్హా తీసుకువచ్చి, సిబ్బందిని ఇంటరాగేట్ చేస్తున్నట్టు పీఆర్ఓ డిఫెన్స్ గుజరాత్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.


ఇండియన్ తీర ప్రాంత నౌక (ICGS) అరింజయ్ (Arinjay) పెట్రోలింగ్ చేస్తుండగా అరేబియా సముద్రంలోని భారత ప్రాదేశిక జలాల్లో పాక్ ఫిషింగ్ బోటును గుర్తించింది. అంతర్జాతీయ తీర ప్రాంత సరిహద్దుకు 15 కిలోమీటర్ల లోపు భారత జలాల్లో మంగళవారంనాడు పాక్ పడవ కనిపించిండంతో సిబ్బంది అప్రమత్తమైంది. భారత ప్రాదేశిక జలాల్లోనే పడవను అరింజయ్ అడ్డుకుంది. పడవలోని సిబ్బంది పాక్ జలాల్లోకి పారిపోయేందుకు జరిపిన ప్రయత్నాన్ని నిలువరించింది. పాక్ ఫిషింగ్ బోట్ ఈనెల 19న కరాచీ నుంచి 13 మంది సిబ్బందితో బయలుదేరినట్టు ఆ ప్రకటన తెలిపింది. కాగా, భారత జలాల్లో ఎందుకు చేపలు పడుతున్నారనే ప్రశ్నకు పాక్ పడవ సిబ్బంది సమాధానం ఇవ్వకపోవడంతో పడవను సీజ్ చేసి గుజరాత్‌కు తరలించామని, సిబ్బందిని ప్రశ్నిస్తున్నామని పేర్కొంది.

Updated Date - 2023-11-22T15:59:40+05:30 IST