Netherlands coast : నెదర్లాండ్స్ తీరంలో 3,000 కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు..

ABN , First Publish Date - 2023-07-27T12:40:15+05:30 IST

నెదర్లాండ్స్ తీరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 కార్లను తీసుకెళ్తున్న సరుకు రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ నౌకలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ మంటలు కొన్ని రోజులపాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్‌గార్డ్ హెచ్చరించింది.

Netherlands coast : నెదర్లాండ్స్ తీరంలో 3,000 కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు..

లండన్ : నెదర్లాండ్స్ తీరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 కార్లను తీసుకెళ్తున్న సరుకు రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ నౌకలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ మంటలు కొన్ని రోజులపాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్‌గార్డ్ హెచ్చరించింది.

పనామాలో రిజిస్టర్ అయిన ఫ్రెమాంటిల్ హైవే అనే సరుకు రవాణా నౌక జర్మనీ నుంచి ఈజిప్టు వెళ్తోంది. 199 మీటర్ల పొడవైన ఈ నౌకలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సిబ్బందిలో చాలా మంది నౌక నుంచి దూకేశారు.

నెదర్లాండ్స్‌లోని ఇండియన్ ఎంబసీ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పోస్ట్‌లో, ఈ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం కారణంగా ఈ నౌకలో పని చేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు, కొందరు సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. మృతుని కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నామని, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహాయపడతామని తెలిపింది. గాయపడినవారు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. డచ్ అధికారులతో సమన్వయం కుదుర్చుకుని సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తున్నట్లు వివరించింది.


డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. ఈ నౌక అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత కొందరు సిబ్బంది నౌక నుంచి దూకేశారని చెప్పారు. వీరికి సహాయపడేందుకు పడవలు, హెలికాప్టర్లను పంపించినట్లు వివరించారు.

ఇదిలావుండగా, ఈ నౌక నుంచి దట్టమైన పొగ వస్తోంది. ఇది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వలస పక్షులకు చాలా ముఖ్యమైన మజిలీ ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించే వేడెన్ సముద్ర తీరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రదేశానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఉంది.

ఈ నౌకలో మంటలను ఆర్పేందుకు డచ్ అగ్నిమాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మంటలను పూర్తిగా ఆర్పేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని అధికారులు చెప్తున్నారు.


ఇవి కూడా చదవండి :

No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

Updated Date - 2023-07-27T12:40:15+05:30 IST