Share News

NASA: భారత్ పర్యటనలో నాసా అడ్మినిస్ట్రేటర్.. పరిశోధన రంగంలో పరస్పర సహకారంపై చర్చ

ABN , First Publish Date - 2023-11-26T11:12:31+05:30 IST

అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్(Bil Nelsun) భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆవిష్కరణలు, పరిశోధన, హ్యూమన్ రిసర్చ్, భూ శాస్త్రంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నెల్సన్ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలతో సోమవారం సమావేశమవుతారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

NASA: భారత్ పర్యటనలో నాసా అడ్మినిస్ట్రేటర్.. పరిశోధన రంగంలో పరస్పర సహకారంపై చర్చ

ఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్(Bil Nelsun) భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆవిష్కరణలు, పరిశోధన, హ్యూమన్ రిసర్చ్, భూ శాస్త్రంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నెల్సన్ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలతో సోమవారం సమావేశమవుతారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్ పర్యటన అనంతరం ఆయన యూఏఈకి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై US, ఇండియా పరస్పర సహకారంపై చర్చించేందుకు నెల్సన్ పర్యటన ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఆయన ఇవాళ బెంగళూరులోని రిసర్చ్ సెంటర్లను సందర్శిస్తారు. NASA, ISRO మధ్య మొదటి ఉపగ్రహ మిషన్‌గా NISAR విప్లవాత్మక పరికరంగా నిలిచింది.


NISAR అంటే నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ సంక్షిప్త పదం. మారుతున్న పర్యావరణ వ్యవస్థలు, ఉపరితలాలు, మంచు పరిమానాన్ని కొలుస్తుంది. బయోమాస్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. సహజ ప్రమాదాలు, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, వాతావరణ మార్పులు, ప్రమాదాల నివారణ, వ్యవసాయానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తుంది.

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) డైరెక్టర్ లారీ లెషిన్ మాట్లాడుతూ.. ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్)పై కలిసి పనిచేస్తున్నారన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వచ్చే డేటాను ఎక్కువగా ఉపయోగించుకునేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. "నాసా, ఇస్రోలు కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌లో తీరప్రాంతాల వద్ద వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాం.

మంచు ఫలకల్లో మార్పు.. సముద్ర మట్టాల పెరుగుదలపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేస్తాం. భూగోళాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని లెషిన్ అన్నారు. నిసర్ పై నాసా, ఇస్రో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. భారత్ పర్యటన అనంతరం నెల్సన్ యూఏఈ పర్యటనకు వెళ్తారు. 2023 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్ ఈ సదస్సుకు హాజరుకావడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-11-26T11:26:59+05:30 IST