Richest Beggar: ఈ బిచ్చగాడి ఆస్తి ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ABN , First Publish Date - 2023-07-06T17:00:16+05:30 IST
ముంబైలోని భరత్ జైన్ అనే వ్యక్తి అక్కడి వీధుల్లో బిచ్చం ఎత్తుకుంటాడు. ప్రతిరోజూ రూ.2వేల నుంచి రూ.2,500 వరకు సంపాదిస్తుంటాడు. కానీ అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు అని స్పష్టమైంది. అతడి ఆస్తులు అక్షరాలా రూ.7.5 కోట్లు అని వెల్లడైంది.
సాధారణంగా బిచ్చగాడు అంటే ఆర్ధికంగా వెనుకబడి ఉండటం, వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోవడం, చింపిరి జట్టు ఉండటం లాంటివి చూస్తుంటాం. కానీ కోట్ల ఆస్తులు ఉన్న బిచ్చగాళ్లను ఎక్కడైనా మనం చూశామా? అయితే ఈ స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ముంబైలోని ఓ బిచ్చగాడికి రూ.కోట్లలో ఆస్తులు ఉన్నట్లు తాజాగా తెలిసింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ముంబైలోని భరత్ జైన్ అనే వ్యక్తి అక్కడి వీధుల్లో బిచ్చం ఎత్తుకుంటాడు. ప్రతిరోజూ రూ.2వేల నుంచి రూ.2,500 వరకు సంపాదిస్తుంటాడు. కానీ అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు అని స్పష్టమైంది. అతడి ఆస్తులు అక్షరాలా రూ.7.5 కోట్లు అని వెల్లడైంది. భరత్ జైన్‌కు ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్‌రూం ఇంటితో పాటు థానేలో నెలకు రూ.30వేలు అద్దె వచ్చే రెండు షాపులు ఉన్నాయి. బెగ్గింగ్ ద్వారా నెలకు రూ.60వేల నుంచి రూ.75వేలు సంపాదించడంతో పాటు షాపుల ద్వారా రూ.60వేలు ఆదాయం వస్తుంది. అంటే నెలకు అతడి సంపాదన సుమారు రూ.1.2 లక్షలకు పైగానే ఉంటుంది.
ఇది కూడా చదవండి: టమాటా రేటు పెరిగిందని బాధపడేవాళ్లకు ఈ విషయాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు.. ఇంకా నాలుగైదు రెట్లు ధర పెరిగినా..!
ఈ స్టోరీ తెలిసిన తర్వాత చాలా మంది తాము కూడా జాబ్స్ చేసే బదులు బిచ్చం ఎత్తుకుని బతికితే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. తాము రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేసినా 20 వేలు కూడా సంపాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ భరత్ మాత్రం 10 నుంచి 12 గంటలు మాత్రమే కష్టపడి ప్రజల వద్ద అడుక్కుంటూ నెలకు రూ.70వేలు సంపాదించడం గ్రేట్ అని అభినందిస్తున్నారు. కాగా భరత్ జైన్ ప్రతిరోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వద్ద అడుక్కుంటూ కనిపిస్తాడని అక్కడి ప్రజలు చెప్తున్నారు.