Share News

Kiren Rijiju: కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ.. ఇతర నేతలకు కూడా!

ABN , First Publish Date - 2023-10-13T21:10:15+05:30 IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా...

Kiren Rijiju: కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ.. ఇతర నేతలకు కూడా!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా కానిచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగానే.. శుక్రవారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజుని మిజోరాం రాష్ట్రానికి గాను పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు ఇతర నేతలకు కూడా కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్‌ ఆంటోనీ, నాగాలాండ్‌ ఉప ముఖ్యమంత్రి యంతుంగో పాటన్‌లు మిజోరాం ఎన్నికలకు పార్టీ కో-ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.

మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నవంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. అంటే 2018 నవంబర్‌లో జరిగిన ఎలక్షన్స్‌లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) 26 సీట్లు గెలుచుకుంది. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) ఎనిమిది స్థానాలను కైవసం కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ ఐదు, బీజేపీ ఒక సీటు మాత్రమే సొంతం చేసుకున్నాయి. అయితే.. ఈసారి మిజోరాంలోనూ సత్తా చాటాలన్న ఉద్దేశంతో బీజేపీ తనదైన వ్యూహాలు రచిస్తోంది. అటు.. జతీందర్ పాల్ మల్హోత్రాను పార్టీ ఛత్తీగఢ్ యూనిట్ ప్రెసిడెంట్‌గా నియమించిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ మరో ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నియామకాలన్నింటినీ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆమోదించారని పార్టీ తెలిపింది.

Updated Date - 2023-10-13T21:10:15+05:30 IST