Mega Deal: మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అమెరికా దిగ్గజం జీఈ మెగా ఒప్పందం

ABN , First Publish Date - 2023-06-22T17:40:31+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ఏరోస్పేస్ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఈ ఏరోస్పేస్ గురువారం ఓ ప్రకటన చేసింది.

Mega Deal: మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అమెరికా దిగ్గజం జీఈ మెగా ఒప్పందం

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా (Modi US visit) పర్యటన సందర్భంగా జెట్ ఇంజన్లు, విడి భాగాల తయారీ అమెరికా దిగ్గజం జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత వైమానిక దళం కోసం భారత్‌లో ఫైటర్ జెట్ ఇంజన్లను ఉత్పత్తికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఈ ఏరోస్పేస్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఈ ఒప్పందాన్ని ఓ మైలురాయిగా అమెరికా ఏరోస్పేస్ అభివర్ణించింది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకరాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించింది. జీఈ ఏరోస్పేస్ ప్రకారం.. ఎఫ్414 ఇంజిన్ల ఉత్పత్తి రెండు సంయుక్తంగా ఉంటుంది.

‘‘ఈ ఒప్పందం భారత్, హెచ్‌ఏఎల్‌తో చారిత్రాత్మక ఒప్పందం” అని GE ఛైర్మన్, లారెన్స్ కల్ప్ కొనియాడారు. ‘‘మా F414 ఇంజిన్లు సాటిలేనివి. రెండు దేశాలకు ముఖ్యమైన ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను అందిస్తాయి. అత్యధిక నాణ్యత గల ఇంజిన్లను ఉత్పత్తి చేయడంలో ముందుంటాం’’ అని లారెన్స్ కల్ఫ్ తెలిపారు. LCA Mk2 ప్రోగ్రామ్‌లో భాగంగా భారత వైమానిక దళం కోసం 99 ఇంజిన్లను నిర్మించడానికి ఈ ఒప్పందం ముందుకు తీసుకువెళ్తుందని యూఎస్ దిగ్గజం జీఈ ఏరోస్పేస్ తెలిపింది.

Updated Date - 2023-06-22T17:57:35+05:30 IST