Mask: వైద్య సిబ్బందికి మాస్క్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2023-03-07T13:04:00+05:30 IST

రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించిన నే

Mask: వైద్య సిబ్బందికి మాస్క్‌ తప్పనిసరి

- హెచ్‌3ఎన్‌2 వైర్‌సతో ప్రభుత్వ నిర్ణయం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించిన నేపథ్యంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌(Minister Dr. Sudhakar) నగరంలో వైద్యనిపుణులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌ వేరియంట్లలో ఒకటైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌ వివిధ దేశాల్లో ప్రభావం చూపుతోందన్నారు. 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రమాదం ఎక్కువన్నారు. హెచ్‌3ఎన్‌2 రోగ లక్షణాలు కొవిడ్‌ రీతిలోనే ఉంటాయన్నారు. కొవిడ్‌కు అందిస్తున్న చికిత్సలే కొనసాగించాలని తీర్మానించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని నిర్ణయించారు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకోవాలని, ఏడాదికోసారి తప్పనిసరిగా వ్యాక్సిన్‌ డోసు పొందాలని నిర్ణయించారు. ప్రభుత్వమే సిబ్బందికి వ్యాక్సిన్‌ సమకూర్చనుంది. కేంద్రప్రభుత్వం ప్రతి వారం 25 రకాల టెస్టులు చేయాలని సూచించిన మేరకు అమలు చేయాలని నిర్ణయించారు. జలుబు, దగ్గు, జ్వరం(Cold, cough, fever) లక్షణాలు ఉంటే వారిపై నిఘా ఉంచి వారం రోజులైనా తగ్గకపోతే ప్రత్యేక టెస్ట్‌లు చేస్తారు. 15 ఏళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నారు. వైద్య సిబ్బంది వివిధ జబ్బులతో వచ్చే రోగులను అప్రమత్తం చేయాల్సి ఉంటుందన్నారు. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వైరస్‌ లేకున్నా యాంటి బయాటిక్స్‌ తీసుకోరాదన్నారు. వైద్యుల సలహా సూచనలు పాటించాలన్నారు. ఎండ వేడిమి పెరుగుతున్న తరుణంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలలోపు సంచారం తగ్గించాలని సూచించారు.

Updated Date - 2023-03-07T13:04:00+05:30 IST