Share News

Mallikarjun Kharge: బలమైన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికే టార్గెట్‌గా సీఈసీ మీటింగ్

ABN , First Publish Date - 2023-10-13T14:50:01+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మధ్యప్రదేశ్(Madyapradesh) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని(CEC) నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ మీటింగ్‌కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) అధ్యక్షత వహించారు.

Mallikarjun Kharge: బలమైన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికే టార్గెట్‌గా సీఈసీ మీటింగ్

భోపాల్: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మధ్యప్రదేశ్(Madyapradesh) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని(CEC) నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ మీటింగ్‌కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ముఖ్య నేతలు అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోనీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్(Kamalnath) తదితర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగే నాయకులను ఎంపిక చేయడమే టార్గెట్ గా మీటింగ్ జరిగింది.


ఫైనలైజ్ అయిన అభ్యర్థుల లిస్టును త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత వారం సీఈసీ సమావేశంలో మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు వీలుగా చర్చలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో నవంబర్ 30 న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు.

Updated Date - 2023-10-13T14:50:01+05:30 IST