London : బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే, మీ మూత్రాన్ని మీపైకే పంపించే ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-01-20T14:31:51+05:30 IST

బహిరంగ మూత్ర విసర్జన సమస్య పరిష్కారానికి సెంట్రల్ లండన్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. మూత్ర విసర్జన చేసినవారిపైకే

London : బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే, మీ మూత్రాన్ని మీపైకే పంపించే ఏర్పాట్లు
London

లండన్ : బహిరంగ మూత్ర విసర్జన సమస్య పరిష్కారానికి సెంట్రల్ లండన్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. మూత్ర విసర్జన చేసినవారిపైకే ఆ మూత్రం తుళ్లే విధంగా ప్రత్యేకమైన ద్రవాన్ని గోడలకు పూయాలని నిర్ణయించారు. ఉపరితలాన్ని పరిరక్షించే ఈ ద్రవంపైకి మూత్రం పడగానే వెనుకకు తుళ్లి, ఆ వ్యక్తిని ఆ పని చేయకుండా నిరోధిస్తుందని చెప్తున్నారు.

బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద స్థలాలకు ప్రసిద్ధి చెందిన సోహో ప్రాంతంలోని అధికారులకు ఈ ఆలోచన వచ్చింది. దాదాపు 12 సమస్యాత్మక ప్రదేశాలను వీరు గుర్తించారు. వీటిలోని భవనాలు, ఇతర కట్టడాల గోడలపై స్పెషల్ స్ప్రే-ఆన్ లిక్విడ్‌ను వేయించారు. పారిశ్రామిక సంస్థల్లోని భవనాల గోడల ఉపరితలాలను పరిరక్షించే ఈ పెయింట్ వంటి పదార్థాన్ని గోడపైన పూయడం వల్ల మూత్రం పడిన వెంటనే వెనుకకు చిమ్ముతుంది. ఈ పని చేసినవారికి తక్షణమే సమాధానం చెప్పినట్లవుతుంది.

ఈ లిక్విడ్ చాలా సమర్థవంతంగా పని చేస్తోందని కౌన్సిలర్ ఐచా లెస్ చెప్పారు. ఉదాహరణ కోసం కొంచెం నీటిని పోసి చూపించారు. సోహో పట్టణంలో సుమారు 3,000 మంది నివసిస్తున్నారు. వీరితోపాటు వ్యాపారులు, కార్మికులు కూడా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వినూత్న ఆలోచనను అమలు చేస్తున్నారు.

ఈ రంగును వేసిన తర్వాత ‘‘ఈ గోడ మూత్రవిసర్జన స్థలం కాదు. ఈ ప్రాంతంలో మూత్ర విసర్జన నిరోధక రంగు ఉంది’’ అనే బోర్డును పెడుతున్నారు.

Updated Date - 2023-01-20T14:33:37+05:30 IST