Karnataka Elections 2023: కాంగ్రెస్‌కు 130 నుంచి 150 సీట్లు: సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2023-05-10T13:36:46+05:30 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓవైపు జరుగుతుండగా మరోవైపు ఈనెల 13న జరిగే ఓట్ల లెక్కింపులో తమ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ 130 సీట్లు గెలుచుకుంటుందని తాను మొదట్నించి చెబుతున్నానని, 150 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు.

Karnataka Elections 2023: కాంగ్రెస్‌కు 130 నుంచి 150 సీట్లు: సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Karnataka Elections) ఓవైపు జరుగుతుండగా మరోవైపు ఈనెల 13న జరిగే ఓట్ల లెక్కింపులో తమ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ 130 సీట్లు గెలుచుకుంటుందని తాను మొదట్నించి చెబుతున్నానని, 150 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. పనిచేసే పార్టీకే ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలతో దేశభవిష్యత్ ముడిపడి ఉందని చెప్పారు.

మరోవైపు, ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్ చురుకుగా సాగుతోంది. రాష్ట్రంలో సింపుల్ మెజారిటీతో ఈసారి చరిత్ర సృష్టించనున్నట్టు బీజేపీ చెబుతోంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు, 2018 ఎన్నికల్లో 110 సీట్లు బీజేపీ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈసారి బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు తమకు అధికారం కట్టబెడతారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. రాష్ట్రంలో 38 ఏళ్లుగా వరుసగా ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదని, అంతర్గత సర్వేలు సైతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తేల్చిచెప్పాయని ఆ పార్టీ అంటోంది. ఇదే సమయంలో ప్రభుత్వాల ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్రను జేడీఎస్ సైతం గట్టి ఆశలతోనే ఉది. గతంలో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వని సందర్భాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో జేడీఎస్ చేతులు కలిపి ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించింది.

Updated Date - 2023-05-10T13:36:46+05:30 IST