Hijab: హిజాబ్‌‌తో వస్తే పరీక్ష హాలులోకి అనుమతించబోమని తేల్చి చెప్పిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-03-08T22:37:18+05:30 IST

హిజాబ్‌(Hijab)‌తో వస్తే పరీక్ష హాలులోకి అనుమతించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 Hijab: హిజాబ్‌‌తో వస్తే పరీక్ష హాలులోకి అనుమతించబోమని తేల్చి చెప్పిన ప్రభుత్వం
Karnataka Education Minister BC Nagesh on Hijab issue

బెంగళూరు: హిజాబ్‌(Hijab)‌తో వస్తే పరీక్ష హాలులోకి అనుమతించబోమని కర్ణాటక (Karnataka ) ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందరూ చట్టప్రకారం నడచుకోవాల్సిందేనని కర్ణాటక విద్యాశాఖ మంత్రి (Karnataka Education Minister) బీసీ నగేశ్ (BC Nagesh) బెంగళూరు(Bengaluru)లో స్పష్టం చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ(CCTV) కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. తనిఖీల నేపథ్యంలో విద్యార్ధులు 15 నిమిషాల ముందే పరీక్షా హాళ్లకు చేరుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నగేశ్ వెల్లడించారు.

హిజాబ్‌ ధరించి వస్తే విద్యాసంస్థల్లోకి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం చెప్పడంతో కొంతకాలం క్రితం రగడ జరిగింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాయి. అందరూ చట్టాలను గౌరవించాలని సూచించాయి. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అతి త్వరలో అక్కడ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-03-08T22:38:33+05:30 IST