Share News

Kamalhasan: నటుడు కమల్‌హాసన్‌ పిలుపు.. పార్టీని విస్తృతపరచండి..

ABN , First Publish Date - 2023-11-01T10:07:24+05:30 IST

వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని అభివృద్ధిపరచేందుకు తీవ్రంగా

Kamalhasan: నటుడు కమల్‌హాసన్‌ పిలుపు.. పార్టీని విస్తృతపరచండి..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని అభివృద్ధిపరచేందుకు తీవ్రంగా శ్రమించాలని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌(Kamalhasan) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆళ్వార్‌పేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ‘నమ్మవర్‌’ కార్మిక సంఘం సభ్యుల సమావేశం జరిగింది. పార్టీ ఉపాధ్యాక్షుడు తంగవేలు స్వాగతోపన్యాసం చేయగా, ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమల్‌హాసన్‌ నమ్మవర్‌ కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర సమన్వయకర్తగా మదురైకి చెందిన సొక్కర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కమల్‌ ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని, పార్టీలో వివిధ కార్మిక సంఘాలు విలీనం కావటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికులు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో పార్టీ ప్రచారాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆరునెలలపాటు పార్టీ శ్రేణులంతా 234 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ విస్తృత ప్రచారం చేసి, పార్టీని అభివృద్ధి చేయాలన్నారు. ఈ విషయంలో జిల్లా కమిటీల నేతలు, కార్మిక సంఘాల నేతలు, మహిళా విభాగం ప్రతినిధులు కలిసికట్టుగా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-11-01T10:07:24+05:30 IST