Indore: కాసేపట్లో పెళ్లి..ఇంతలోనే వధువరులిద్దరూ విషం తాగారు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే?

ABN , First Publish Date - 2023-05-18T15:53:19+05:30 IST

20యేళ్ల అమ్మాయి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరుడు ..

Indore: కాసేపట్లో పెళ్లి..ఇంతలోనే వధువరులిద్దరూ విషం తాగారు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే?

ఇండోర్: కాసేపట్లో పెళ్లి..ఇంతలోనే వరుడు(Groom) విషం తాగాడు(Consumed poison). ఇది తెలిసిన వధువు(Bride) కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అతడు ప్రాణాలు కోల్పోగా..వధువు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. కొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువరులు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.

ఇండోర్‌(Indore)లోని కనాడియా ప్రాంతంలో ఓ ఆర్యసమాజ్‌లో 20యేళ్ల అమ్మాయి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరుడు విషం తాగినట్లు తెలిసి..వధువు కూడా విషం తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుడు మృతిచెందగా.. వధువు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

వరుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని అతడిపై ఆ యువతి ఒత్తిడి తెస్తోందని తెలిపారు. కెరీర్ దృష్ట్యా పెళ్లికి రెండేళ్ల గడువు కోరగా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు.

Updated Date - 2023-05-18T15:53:19+05:30 IST