BJP: ఇద్దరయ్యారు..కేజ్రీ వంతు ఎప్పుడు?

ABN , First Publish Date - 2023-03-01T19:05:29+05:30 IST

అవినీతి ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలోని మనీష్ సిసోడియా, సత్యేంద జైన్‌‌ల రాజీనామా అనంతరం ఆప్ సర్కార్‌పై..

BJP: ఇద్దరయ్యారు..కేజ్రీ వంతు ఎప్పుడు?

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలోని మనీష్ సిసోడియా, సత్యేంద జైన్‌‌ల రాజీనామా అనంతరం ఆప్(APP) సర్కార్‌పై బీజేపీ (BJP) దాడి మరింత ముమ్మరం చేసింది. కేజ్రీవాల్ (Kejriwal) వంతు ఎప్పుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav Bhatia) బుధవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు.

''ఆయన పావులు (Pawns) రిజైన్ చేశారు. ఆయన (కేజ్రీవాల్) ఎప్పుడు రిజైన్ చేస్తారు?'' అని గౌరవ్ భాటియా ప్రశ్నించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ "కింగ్‌పిన్'' అని ఆరోపించారు. సిసోడియా రాజీనామా లేఖపై తేదీ కూడా లేదని, దీనిపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ కింగ్‌పిన్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి రాజ్యాంగంతో ఆటలాడే ఎత్తుగడలు వేస్తుండటమే ఇందుకు కారణంగా ఆయన చెప్పారు. మంత్రివర్గానికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కు కేజ్రీవాల్ అధిపతి అని, విచారణను ప్రభావితం చేసే పొజిషన్‌లో ఆయన ఉన్నారని అన్నారు.

కైలాష్ గెహ్లాట్ రాజీనామాకు డిమాండ్..

లిక్కర్ పాలసీని ఆమోదించిన ఢిల్లీ ప్రభుత్వ గ్రూప్ ఆప్ మినిస్టర్స్‌లో కైలాష్ గెహ్లాట్ కూడా సభ్యుడని, ఆ కారణంగా ఆయన కూడా రాజీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని 33 డిపార్ట్‌మెంట్లలో 18 శాఖలు చేతిలో ఉన్న సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా, ఆయన అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. దీంతో ఈనెల 4వ తేదీ వరకూ సీబీఐ కస్టడీలోనే సిసోడియా ఉంటారు. కాగా, మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సత్యేంద్ర జైన్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

Updated Date - 2023-03-01T19:08:20+05:30 IST