Hero Vishal: 22న కోర్టుకు విశాల్‌ హాజరుకావాల్సిందే...

ABN , First Publish Date - 2023-09-20T09:00:45+05:30 IST

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ దాఖలు చేసిన కేసులో హీరో విశాల్‌(Hero Vishal) ఈ నెల 22వ తేదీ కోర్టుకు హాజరుకావాలని మద్రాస్‌ హైకోర్టు

Hero Vishal: 22న కోర్టుకు విశాల్‌ హాజరుకావాల్సిందే...

- లైకా కేసులో కోర్టు ఆదేశం

అడయార్‌(చెన్నై): ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ దాఖలు చేసిన కేసులో హీరో విశాల్‌(Hero Vishal) ఈ నెల 22వ తేదీ కోర్టుకు హాజరుకావాలని మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. లైకా సంస్థకు విశాల్‌ రూ.21.29 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.15 కోట్లను డిపాజిట్‌ చేయాలని, విశాల్‌ తన ఆస్తుల వివరాల జాబితా ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసు విచారణకు రాగా, విశాల్‌ తరపున న్యాయవాది హాజరుకాలేదు. అలాగే, బ్యాంకు ఖాతాలు, చర, స్థిరాస్తుల వివరాలు ఇవ్వని కారణంగా ఈ నెల 22వ తేదీన విశాల్‌ స్వయంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Updated Date - 2023-09-20T09:00:45+05:30 IST