Hero Dhanush : హీరో ధనుష్‌ కేసు మరో జడ్జికి బదిలీ

ABN , First Publish Date - 2023-02-28T09:30:09+05:30 IST

హీరో ధనుష్(Hero Dhanush) తమ కుమారుడుఅంటూ మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై

Hero Dhanush : హీరో ధనుష్‌ కేసు మరో జడ్జికి బదిలీ

అడయార్‌(చెన్నై): హీరో ధనుష్(Hero Dhanush) తమ కుమారుడుఅంటూ మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేయాల్సిందిగా హైకోర్టు మదురై బెంచ్‌(High Court Madurai Bench) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ దంపతులు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా ఇది పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ పిటిషన్‌ను మరో న్యాయమూర్తికి బదిలీ చేసి, జాబితాలో చేర్చాల్సిందిగా మదురై బెంచ్‌ ఆదేశించింది. దీంతో ధనుష్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-02-28T09:30:09+05:30 IST