Share News

Republice Day parade: పంజాబ్ శకటంపై రగడ.. సీఎం ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్రం

ABN , Publish Date - Dec 31 , 2023 | 07:40 PM

రిపబ్లిక్ డే పరేడ్-2024లో శకటాల ప్రదర్శనకు పంజాబ్ శకటానికి చోటు దక్కకపోవడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్య పంజాబ్ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షను చాటుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యాలను కేంద్ర రక్షణ శాఖ ఆదివారంనాడు తోసిపుచ్చింది. మాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది.

Republice Day parade: పంజాబ్ శకటంపై రగడ.. సీఎం ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్-2024 (Republic Day parade)లో శకటాల ప్రదర్శనకు పంజాబ్ (Punjab) శకటానికి చోటు దక్కకపోవడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్య పంజాబ్ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షను చాటుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhawant singh Mann) ఇటీవల చేసిన వ్యాఖ్యాలను కేంద్ర రక్షణ శాఖ ఆదివారంనాడు తోసిపుచ్చింది. మాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది.


నిపుణుల కమిటీ నిర్ణయమన్న రక్షణ శాఖ

శకటాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు చేసే ప్రతిపాదనలను కళలు, సంస్కృతి, పెయింటింగ్, శిల్పం, మ్యూజిక్, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ తదితర రంగాల ప్రముఖులతో కూడిన నిపుణుల కమిటీ మందిపు చేస్తుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పంజాబ్ శకటానికి సంబంధించిన ప్రతిపాదన నిపుణుల కమిటీ మొదటి మూడు రౌండ్లలో పరిశీలించడం జరిగిందని, అయితే ఈ ఏడాది శకటాల థీమ్‌కు దూరంగా పంజాబ్ శకటం ఉండటంతో ఆ తర్వాత రౌండ్‌లో అతి పరిశీలనకు నోచుకోలేదని చెప్పింది. రిపబ్లిక్ డే పరేడ్‌కు నోచుకోని శకటాలను జనవరి 23 నుంచి 31 వరకూ ఎర్రకోట వద్ద జరిగే 'భారత్ పర్వ్'లో ప్రదర్శనకు ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ మేరకు ఎంఓయూ కూడా ఉందని తెలిపింది.


రిపబ్లిక్ డే పరేడ్‌లో శకటాల ప్రదర్శనకు పంజాబ్, పశ్చిమబెంగాల్ సహా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిపాదనలు పంపాయని, వీటిలో 15 నుంచి 16 శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఎంపికయ్యాయని రక్షణ శాఖ తెలిపింది. పంజాబ్, ఢిల్లీతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం, 2024 జనవరి 26 నుంచి మూడేళ్లలో ఏదో ఒక ఏడాది శకటాల ప్రదర్శనకు అంగీకారం కుదిరిందన్నారు. ఆ ప్రకారం 2024లో పంజాబ్ శకటం ఎంపిక కానంత మాత్రాన వివక్ష చూపామంటూ ఆరోపణలు చేయడం పూర్తిగా అర్ధరహితమని స్పష్టం చేసింది.


భారత్ పర్వ్‌కు పంపేది లేదన్న సీఎం

కాగా, పంజాబ్ శకటాన్ని ఎర్రకోట వద్ద జరిగే 'భారత్ పర్వ్'కు పంపేది లేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక ట్వీట్‌లో తెగేసి చెప్పారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, లాలా లజపత్ రాయ్ వంటి సాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీకగా రూపొందించిన పంజాబ్ శకటాన్ని రెజెక్టెడ్ క్యాటగిరిలో పంపేది లేదన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 07:40 PM