Share News

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

ABN , First Publish Date - 2023-11-01T17:56:31+05:30 IST

బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

పట్నా: బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మిత్ర పక్షంలో కొందరు ప్రభుత్వ విజయాలను తమ పార్టీల క్రెడిట్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. "కేబినెట్ లోని కొందరు మంత్రుల్ని నేను గమనించాను. ప్రభుత్వం చేసిన మంచి పనిని వారి పార్టీకి లబ్ధి చేకూర్చేలా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నేను బీహార్‌లో ఏదైనా మంచి పని చేస్తే వ్యక్తిగత విజయంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ విషయాన్ని మంత్రులంతా గుర్తుంచుకోవాలి.


పార్టీలు లబ్ధి పొందాలని చూడకుండా ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి" అని అన్నారు. బిహార్ కేబినెట్ లో పలువురు రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్(Congress) సభ్యులు మంత్రులుగా ఉన్నారు. బీజేపీతో తెగదింపుల తరువాత నితీష్ మహాఘట్ బంధన్ పేరుతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. వారు ప్రభుత్వ విజయాలను పార్టీల ప్రచారానికి వాడుకుంటున్నారని జేడీయూ(JDU) అధినేత అన్నారు. నితీష్ తన ప్రసంగంలో సీనియర్ మంత్రి బిజేంద్ర యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు విద్యుత్తు రంగంపై దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉందని అన్నారు. ఆయన మంత్ర అయ్యాక రాష్ట్రంలో కరెంటు సరఫరా పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. పట్నాలో కూడా పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. రోజుకి 8 గంటల కరెంటే వస్తుందని తన అత్తమామల నుంచి ఫిర్యాదులు వచ్చేవని.. ఇప్పుడు మొత్తం మారిందన్నారు.

Updated Date - 2023-11-01T17:56:51+05:30 IST