Gali Janardhana Reddy: ఆయన హత్య దారుణం.. హంతకులను వదలొద్దు..

ABN , First Publish Date - 2023-07-21T13:27:17+05:30 IST

బళ్ళారిలో ఇంటర్నేషన్‌ క్రికెట్‌ స్డేడియంను నిర్మించాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) కో

Gali Janardhana Reddy: ఆయన హత్య దారుణం.. హంతకులను వదలొద్దు..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బళ్ళారిలో ఇంటర్నేషన్‌ క్రికెట్‌ స్డేడియంను నిర్మించాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) కోరారు. గురువారం బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ బళ్ళారిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాలణాలకు తగిన స్థలం ఉందన్నారు. ప్రధాన నగరాలకే అన్ని సౌలభ్యాలు కాకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరింప చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే తగిన చొరవ చూపాలన్నారు. నవళి జలాశయంను వెంటనే పూర్తీ చేయాలన్నారు. తద్వారా రాయచూరు, బళ్ళారి, కొప్పళ, విజయనగర జిల్లాలకు అనుకూలం కానుందన్నారు. నవలి ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలుపడాన్ని సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమా(CM Siddaramaiah, DCM DK Shivakumar)ర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. రాయచూరుకు యూనివర్శిటీ ప్రకటించారని కానీ కేవలం రూ.15 కోట్లు కేటాయించారన్నారు. యూనివర్శిటీ ఏర్పాటు చేయాలంటే కనీసం వందకోట్లు అవసరమన్నారు. ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ట్యాక్స్‌ కోట్లాది రూపాయలు ఉందని వాటిని జిల్లా అభివృద్దికి వినియోగించాలన్నారు. బళ్ళారిలో కళ్యాణ కర్ణాటక(Kalyana Karnataka) ప్రగతిపక్ష కార్యకర్త మహబూబ్‌ పాషాను ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారన్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. మాపార్టీలో చురుకైన కార్యకర్తను కాంగ్రెస్‌కు చెందిన వారు కిరాతకంగా హతమార్చారన్నారు. రాజకీయ ద్వేషంతోనే హత్య చేశారని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-07-21T13:27:18+05:30 IST