Share News

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. చివరకు ఉద్యోగులక్కూడా వేతనాలివ్వలేని ప్రభుత్వం..

ABN , First Publish Date - 2023-11-08T12:56:23+05:30 IST

రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని మాజీ ముఖ్యమంత్రి,

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. చివరకు ఉద్యోగులక్కూడా వేతనాలివ్వలేని ప్రభుత్వం..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప(BS Yeddyurappa) ఆరోపించారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిధులన్నీ గ్యారెంటీలకే మళ్లిస్తుండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గత బీజేపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంటీరియమ్‌ రిలీఫ్‏ను ప్రకటించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాకులు వెతికి వేతనసంఘం అవధిని విస్తరించిందన్నారు. గత బీజేపీ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలకు విరివిగా నిధులు మంజూరు కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలనలో నిధులు లేక ఎక్కడికక్కడే కుంటుపడ్డాయన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తనను స్టార్‌ క్యాంపైనర్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి స్టార్‌ క్యాంపైనర్లుగా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజె, ఏ నారాయణస్వామి, భగవంత్‌ ఖూబాలకు కూడా చోటు దక్కింది. మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తరలి వెళ్తున్నట్టు యడియూరప్ప వెల్లడించారు.

Updated Date - 2023-11-08T13:26:24+05:30 IST