Share News

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మేం ఐక్యంగా ఉంటే 28 స్థానాలు ఖాయం

ABN , First Publish Date - 2023-11-16T13:03:19+05:30 IST

ఐక్యంగా ముందుకు సాగితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేయడం

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మేం ఐక్యంగా ఉంటే 28 స్థానాలు ఖాయం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఐక్యంగా ముందుకు సాగితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేయడం పెద్దకష్టం ఏమీ కాదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల ఫలితాలతో కొంతమేరకు డీలాపడిన పార్టీ శ్రేణుల్లో విజయేంద్ర రాకతో కొత్త ఉత్సాహం నెలకొని ఉందన్నారు. వరల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీల్లో భారత్‌ లాగే బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటనుందన్నారు.

Updated Date - 2023-11-16T13:03:20+05:30 IST