Forest Fire: కొడైకెనాల్ హిల్స్‌లో భారీ దావానలం

ABN , First Publish Date - 2023-03-15T19:53:46+05:30 IST

తమిళనాడులోని దుండిగల్ జిల్లా కొడైకెనాల్ హిల్స్ సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ దావానలం..

Forest Fire: కొడైకెనాల్ హిల్స్‌లో భారీ దావానలం

దుండిగుల్: తమిళనాడు (Tamilnadu)లోని దుండిగల్ జిల్లా కొడైకెనాల్ హిల్స్ సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ దావానలం (Forest fire) చెలరేగింది. మంటలు మరింత విస్తరించకుండా అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు బుధవారంనాడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నాయి.

మరోవైపు, గోవాలోని అడవుల్లో నాలుగు రోజుల క్రితం చెలరేగిన భారీ దావానలం ఇంకా చల్లారలేదు. ప్రభుత్వ యంత్రాంగం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ పూర్తి ఫలితాన్నివ్వడం లేదు. మంటలు తీరంలోని ఇతర అడవులకు వ్యాపిస్తున్నాయి. ఒకచోట మంటలు అదుపులోకి వచ్చే సమయానికి ఇంకో చోట మంటలు అంటుకుంటూ ఆందోళన కలిస్తుండటంతో సైనిక హెలికాప్టర్ల ద్వారా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఈ అంశంపై ప్రధాని మంత్రి సైతం ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-15T19:54:42+05:30 IST