Electric Car: నడి రోడ్డుపై క్షణాల్లో కాలి బూడిదైన ఎలక్ట్రిక్ కారు

ABN , First Publish Date - 2023-10-01T19:09:20+05:30 IST

ఎలక్ట్రిక్ వాహనాలు క్షణాల్లో కాలి బూడిదవుతున్న సంఘటనల్ని తరచూ చూస్తున్నాం. వాటి భద్రత విషయంలో ఇవి అనేక సందేహాలు కలగజేస్తున్నాయి. తాజాగా మరో ఎలక్ట్రిక్ కారు కాలి బూడిదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని జేపీ నగర్ వీధి మీదుగా ఓ ఎలక్ట్రిక్ కారు వెళ్లింది.

Electric Car: నడి రోడ్డుపై క్షణాల్లో కాలి బూడిదైన ఎలక్ట్రిక్ కారు

బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహనాలు క్షణాల్లో కాలి బూడిదవుతున్న సంఘటనల్ని తరచూ చూస్తున్నాం. వాటి భద్రత విషయంలో ఇవి అనేక సందేహాలు కలగజేస్తున్నాయి. తాజాగా మరో ఎలక్ట్రిక్ కారు కాలి బూడిదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని జేపీ నగర్ వీధి మీదుగా ఓ ఎలక్ట్రిక్ కారు వెళ్లింది. అకస్మాత్తుగా అందులో పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. అప్రమత్తమైన కారు యజమాని అందులోంచి బయటకి దిగాడు.


షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అవి కారు మొత్తం వ్యాపించడంతో క్షణాల్లో కారు కాలి బూడిదైంది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో కారు నుంచి వస్తున్న దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. ఈవీ వాహనాలు వాడాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా వాటి భద్రతపై ఇప్పటికీ నీలి నీడలు తొలగిపోలేదు.

Updated Date - 2023-10-01T19:09:20+05:30 IST