ED inspections: మంత్రి స్నేహితుడి ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు
ABN , First Publish Date - 2023-08-06T08:29:50+05:30 IST
దిండుగల్ జిల్లా వేడచందూరులో నివసిస్తున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్నేహితుడు సామినాథన్
- రూ.25 లక్షలు స్వాధీనం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): దిండుగల్ జిల్లా వేడచందూరులో నివసిస్తున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్నేహితుడు సామినాథన్ నివాసంలో రెండు రోజులపాటు సాగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల తనిఖీలు ముగిశాయి. ఆ తనిఖీల్లో లభించిన సమాచారం ఆధారంగా నామక్కల్ జిల్లా పరమత్తివేలూరు చక్కార్‌నగర్ రాజాజీ వీధిలో నివసిస్తున్న పారిశ్రామికవేత్త టయర్‌కడై మణి అలియాస్ కాళియప్పన్ నివాసగృహంలో ఈడీ అధికారులు శుక్రవారం నుంచి శనివారం వేకువజాము వరకు నిర్విరామంగా తనిఖీలు జరిపి లెక్కల్లో లేని రూ. 22 లక్షలు, స్థిరాస్థులకు సంబంధించిన 60 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

