MSC Bank scam case: ఈడీ చార్జ్ షీటులో అజిత్ పవార్, అతని భార్య సునేత్ర పేర్ల తొలగింపు

ABN , First Publish Date - 2023-04-12T09:08:40+05:30 IST

మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ (MSC) బ్యాంక్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఛార్జిషీట్‌ను సమర్పించింది....

MSC Bank scam case: ఈడీ చార్జ్ షీటులో అజిత్ పవార్, అతని భార్య సునేత్ర పేర్ల తొలగింపు
Ajit Pawar, wife Sunetra

ముంబయి: మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ (MSC) బ్యాంక్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఛార్జిషీట్‌ను సమర్పించింది.(MSC Bank scam case) ఈ కుంభకోణంలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, అతని భార్య సునేత్రకు సంబంధించిన చక్కెర మిల్లు ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ ఛార్జిషీట్(ED files chargesheet) నుంచి అజిత్ పవార్ అతని భార్య సునేత్ర (Ajit Pawar, wife Sunetra)పేర్లను తొలగించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Myanmar: తిరుగుబాటుదారులపై మిలటరీ దాడులు...100 మంది మృతి

ఈ స్కాంలో తనపై మనీలాండరింగ్ కేసు పెట్టారని అజిత్ పవార్ భార్య సునేత్ర కోర్టుకు వెళ్లారు. అజిత్ పవార్, అతని భార్య సునేత్ర పేర్లు ఈడీ ఛార్జిషీట్ నుంచి తొలగించినా, ఈ బ్యాంక్ స్కామ్‌ను విచారిస్తున్నప్పుడు వచ్చిన కొన్ని కంపెనీల పేర్లను అలాగే ఉంచారు.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కోరేగావ్‌లో ఉన్న జరందేశ్వర్ సహకరి షుగర్ మిల్‌కు చెందిన భూమి, భవనం, ప్లాంట్, మెషినరీ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2023-04-12T09:08:40+05:30 IST