DK Shivakumar: తమిళనాడుకు ‘కావేరి’ ని విడుదల చేస్తాం..

ABN , First Publish Date - 2023-07-23T12:52:19+05:30 IST

రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావం ఉన్నప్పటికీ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చే

DK Shivakumar: తమిళనాడుకు ‘కావేరి’ ని విడుదల చేస్తాం..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావం ఉన్నప్పటికీ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేస్తామని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) వెల్లడించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన నాలుగైదేళ్లతో పోలిస్తే తీవ్రమైన వర్షపు లోటు ఉందన్నారు. కావేరి(Kaveri) జలాశయాల నుంచే బెంగళూరు, మైసూరు, మండ్య(Bangalore, Mysore, Mandya)కు తాగునీటిని సమకూరుస్తున్నామన్నారు. తాగునీటి అవసరాలపై సమీక్ష జరిపి తమిళనాడుకు నీరు విడుదల చేస్తామన్నారు. గత వారం రోజులుగా కావేరి తీరంలో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. కావేరి ట్రిబ్యునల్‌ తీర్పును గౌరవిస్తామన్నారు. తమిళనాడుకు నీటి విడుదల విషయమై జలవనరులశాఖ ఇంజనీర్లతో సమీక్షించామన్నారు. తమిళనాడుకు కావేరి నీరు విడుదల చేయించాలని ఆ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి, కేంద్ర జలవనరులశాఖ మంత్రిని కలసి డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై మంత్రి డీకే శివకుమార్‌ స్పం దించి నీరు విడుదల చేస్తామన్నారు.

Updated Date - 2023-07-23T12:52:20+05:30 IST