Share News

DCM: డిప్యూటీ సీఎం సవాల్... నన్ను ఉరివేసినా వెనుకాడను..

ABN , First Publish Date - 2023-11-18T13:31:29+05:30 IST

మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy)కి ఎటువంటి రికార్డులు అయినా ఇస్తానని, తప్పు చేసి ఉంటే నన్ను ఉరివేయాలని,

DCM: డిప్యూటీ సీఎం సవాల్... నన్ను ఉరివేసినా వెనుకాడను..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy)కి ఎటువంటి రికార్డులు అయినా ఇస్తానని, తప్పు చేసి ఉంటే నన్ను ఉరివేయాలని, అందుకు వెనుకాడేది లేదని డీసీఎం శివకుమార్‌(DCM Shivakumar) సవాల్‌ విసిరారు. శుక్రవారం బెంగళూరులో డీసీఎం మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామి ఎటువంటి రికార్డులు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. లులు మాల్‌కు చెందిన భూమితో పాటు కరెంటు బిల్లులపై కుమారస్వామి ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతానన్నారు. లులు మాల్‌ స్థలం కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందినదన్నారు. వారు టెండర్‌ వేయగా నా మిత్రులు కొందరు దక్కించుకోగా వారి నుంచి నేను కొనుగోలు చేశానన్నారు. కుమారస్వామికు ఇంకా తెలియదని ఆయన తండ్రి దేవేగౌడ పదేళ్ళ కిందటనే సదరు భూమికి సంబంధించి తనిఖీ జరిపించారన్నారు. అన్నింటికీ నేను సిత్థమని కానీ బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదన్నారు. వారికి ఎటువంటి రికార్డులు కావాలన్నా ఇస్తానన్నారు. లులు మాల్‌ కట్టింది నేను కాదని శోభా డెవలపర్స్‌ అన్నారు. వారు ఏఏ బిల్లులు చెల్లించారో చూపుతారని వారికి నేను చెబుతానన్నారు.

Updated Date - 2023-11-18T13:31:31+05:30 IST