Rahul Gandhi: పరువునష్టం కేసులో కోర్టు శిక్ష విధించిన తర్వాత పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-03-24T11:44:24+05:30 IST
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత శుక్రవారం ఆయన పార్లమెంటుకు వచ్చారు....
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత శుక్రవారం ఆయన పార్లమెంటుకు వచ్చారు.(Defamation Case) జైలు శిక్ష పడటం వల్ల పార్లమెంటు సభ్యత్వం రద్దు అవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) శుక్రవారం మధ్యాహ్నం లోక్ సభ వాయిదా పడే వరకు సభలోనే ఉండి నిరసన తెలిపారు.(Rahul Gandhi Visits Parliament) సూరత్ కోర్టు రాహుల్ గాంధీ అప్పీలు చేసుకునేందుకు వీలుగా 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది.ఏ పార్లమెంటు సభ్యుడికైనా కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడితే ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం అనర్హత వేటు విధించవచ్చు.