Inflation: ఆకాశాన్నంటిన జీలకర్ర ధరలు...కిలో ఎంతంటే...

ABN , First Publish Date - 2023-04-18T07:29:52+05:30 IST

దేశంలో సుగంధ ద్రవ్యాలు ధరలు పెరుగుతున్నాయి....

Inflation: ఆకాశాన్నంటిన జీలకర్ర ధరలు...కిలో ఎంతంటే...
Cumin prices Hike

దేశంలో సుగంధ ద్రవ్యాలు ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మసాలా దినుసులైన జీలకర్ర (జీరా) ధరలు ఆకాశన్నంటాయి.

న్యూఢిల్లీ: దేశంలో సుగంధ ద్రవ్యాలు ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మసాలా దినుసులైన జీలకర్ర (జీరా) ధరలు ఆకాశన్నంటాయి.(Cumin prices) దేశంలో ప్రస్థుతం నెలకొన్న వాతావరణ సంక్షోభం వల్ల కిలో జీలకర్ర ధర 600 రూపాయలకు పెరిగింది. దేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రమైన గుజరాత్ రాష్ట్రంలోని ఉన్నా నగరంలో జీలకర్ర హోల్ సేల్ ధర క్వింటాల్‌కు 56వేల రూపాయలకు చేరింది. జీలకర్ర సాగు చేసే రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో వీటి ధరలు పెంచారు.

గుజరాత్ రాష్ట్రంలోని ఉంఘూలో జీలకర్ర హోల్ సేల్ ధర క్వింటాల్ కు 56వేలకు చేరింది. దీని సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే 13 శాతం పెరిగినా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి.డిమాండ్-సప్లైలో పెద్ద అంతరం వల్ల జీలకర్ర ధరలను ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి పెరిగిందని ఉంజా వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తి కమిటీ ఛైర్మన్ దినేష్ పటేల్ అన్నారు.

సుగంధ ద్రవ్యాల వ్యవసాయానికి కేంద్రమైన పశ్చిమ రాజస్థాన్‌లో అసాధారణ వాతావరణ మార్పుల వల్లనే జీలకర్ర దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాస్త్రవేత్త చౌదరి చెప్పారు. ఫిబ్రవరి ప్రారంభంలో జీలకర్ర పంటల అంకురోత్పత్తి దశలో పాకిస్తాన్ వైపు నుంచి పశ్చిమ వెచ్చని గాలి వీచడం వల్ల దిగుబడి తగ్గిందని చౌదరి వివరించారు.

Updated Date - 2023-04-18T12:27:27+05:30 IST