Covid cases: కరోనా వైరస్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే...షాకింగ్

ABN , First Publish Date - 2023-04-15T08:22:01+05:30 IST

కొవిడ్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ సంచలన విషయం బయటపెట్టారు...

Covid cases: కరోనా వైరస్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే...షాకింగ్
Covid cases

కాన్పూర్ : కొవిడ్ కేసుల సంఖ్యపై కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ సంచలన విషయం బయటపెట్టారు. కరోనా మహమ్మారి(Covid cases) మళ్లీ విజృంభిస్తుందా? అంటే అవునంటున్నారు కాన్పూర్ ఐఐటీ ఫ్రొఫెసర్(IIT-Kanpur professor) డాక్టర్ మనీంద్ర అగర్వాల్. మే నెల 15వతేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కుకు చేరుకుంటాయని డాక్టర్ మనీంద్ర అగర్వాల్ శనివారం అంచనా వేశారు. మే నెలలో 50వేల నుంచి 60 వేల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ప్రొఫెసర్ వెల్లడించారు.గణిత నమూనా ఆధారంగా తాను అంచనా వేశానని ప్రొఫెసర్ చెప్పారు.

గడచిన 24 గంటల్లో భారతదేశంలో 11,109 కొత్త కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోజువారీ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. నిన్న 7,830 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49,622గా ఉంది, ఇది మొత్తం కేసులలో 0.11 శాతం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఐఐటీ-కాన్పూర్ ప్రొఫెసర్ కోవిడ్ కేసుల పెరుగుదలకు రెండు కారణాలను వివరించారు.

ఇది కూడా చదవండి :Maharashtra: లోనావాలా వద్ద లోయలో పడ్డ బస్సు...పలువురికి తీవ్ర గాయాలు

మొదటి కారణం ఏమిటంటే వైరస్‌తో పోరాడే సహజ రోగనిరోధక శక్తి ఇప్పుడు 5 శాతం మందిలో తగ్గిందని ప్రొఫెసర్ మనీంద్ర చెప్పారు. రెండవ కారణం కొవిడ్ యొక్క కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రొఫెసర్ వివరించారు.దేశంలో 90 శాతం మందికి , ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 95 శాతం మందికి సహజ రోగనిరోధక శక్తి ఉందని ప్రొఫెసర్ చెప్పారు. తేలికపాటి దగ్గు,జలుబు లక్షణాలు కొవిడ్ రోగుల్లో కనిపిస్తుందని ప్రొఫెసర్ వివరించారు. కొవిడ్ సాధారణ ఫ్లూ లాగా పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-15T08:35:56+05:30 IST