Coromandel Express: నేడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
ABN , First Publish Date - 2023-10-06T09:12:48+05:30 IST
ఖరగ్‌పూర్ డివిజన్‌లోని రైల్వే మార్గానికి మరమ్మతుల కారణంగా శుక్రవారం చెన్నై నుంచి బయలుదేరాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express)
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఖరగ్‌పూర్ డివిజన్‌లోని రైల్వే మార్గానికి మరమ్మతుల కారణంగా శుక్రవారం చెన్నై నుంచి బయలుదేరాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) (12842) పూర్తిగా రద్దయింది. అదే విధంగా శుక్రవారం ఉదయం 10.35 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరాల్సిన హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12864), ఈ నెల 8న మధ్యాహ్నం 2.45 గంటలకు నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరాల్సిన షాలిమార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12659) పూర్తిగా రద్దయ్యాయి.