Congress: ఓటమి భయంతోనే హడావుడిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు

ABN , First Publish Date - 2023-09-22T12:49:42+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే హడావుడిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును

Congress: ఓటమి భయంతోనే హడావుడిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు

- బీజేపీపై కాంగ్రెస్‌ ఎదురుదాడి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే హడావుడిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్‌(Congress) విరుచుకుపడింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో గురువారం మాజీ ఎంపీ వీఎస్‌ ఉగ్రప్ప, మాజీ మేయర్‌ రామచంద్రప్ప తదితరులు మీడియాతో మాట్లాడారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 33శాతం రిజర్వేషన్‌ల బిల్లును తక్షణం అమలులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మహిళా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకే రిజర్వేషన్‌ బిల్లును తెరపైకి తెచ్చిందని నిజానికి 2029 దాకా అమలులోకి రాదంటూ పార్లమెంటులో స్వయంగా హోమంత్రి అమిత్‌షా గుర్తు చేశారని ప్రస్తావించారు. మహిళా రాజకీయ రిజర్వేషన్‌ పరికల్పన కాంగ్రెస్‌దేనని పేర్కొన్నవారు అప్పట్లో ఈ బిల్లును ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా ఉన్న వేళ తీవ్రంగా వ్యతిరేకిం చారన్నారు. అప్పుడు పనికిరాని బిల్లు బీజేపీకి ఇప్పుడు అత్యంత ప్రియంగా ఎందుకు మారిందో అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఓటర్లు చాలా విజ్ఞులని బీజేపీ ఎత్తుగడలకు మోసపోరన్నారు. ‘ఇండియా’ కూటమికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణనుచూసి బీజేపీ భయపడుతోందన్నారు. దిక్కుతోచని స్థితిలోని మహిళా రాజకీయ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించారన్నారు.

pandu4.2.jpg

Updated Date - 2023-09-22T12:49:42+05:30 IST