Coca Cola Company : 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ

ABN , First Publish Date - 2023-04-21T12:31:17+05:30 IST

కేరళలోని పలక్కడ్‌ జిల్లాలో తన స్వాధీనంలో ఉన్న దాదాపు 35 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని మల్టీనేషనల్

Coca Cola Company : 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ
Coca Cola

తిరువనంతపురం : కేరళలోని పలక్కడ్‌ జిల్లాలో తన స్వాధీనంలో ఉన్న దాదాపు 35 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని మల్టీనేషనల్ బెవరేజ్ కంపెనీ కోకాకోలా (Coca Cola Company) నిర్ణయించింది. ప్లచిమడ (Plachimada ) సమీపంలో ఉన్న ఈ భూమిని, దానిలోని ఓ భవనాన్ని అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖను పంపించింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రోడ్రిగ్స్ ట్రోవాటో ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan)కు ఓ లేఖ రాశారు. ప్లచిమడ సమీపంలో ఉన్న 35 ఎకరాల భూమిని, దానిలోని ఓ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు.

రైతుల ఆధ్వర్యంలో నడిచే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ కోసం ఈ భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీని కోసం ఆ కంపెనీతో చర్చలు జరిపింది. విద్యుత్తు శాఖ మంత్రి కే కృష్ణన్ కుట్టితో జరిగిన చర్చలు ఫలవంతం కావడంతో ఈ భూమిని అప్పగించేందుకు ఈ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాకుండా రైతులకు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు కూడా ముందుకు వచ్చింది.

భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతోందని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో 2004 మార్చి నెలలో ఈ కంపెనీ మూతపడింది.

ఇవి కూడా చదవండి :

Jammu & Kashmir: ఉగ్రదాడిలో అమరులైన జవన్ల పేర్లు విడుదల..

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

Updated Date - 2023-04-21T12:31:17+05:30 IST