Chief Minister: నూతన సీఎం సిద్దూ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-21T11:52:02+05:30 IST

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. విధానసౌధలో తొలి కేబినెట్‌ సమావేశం జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Chief Minister: నూతన సీఎం సిద్దూ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని సీఎం సిద్ద రామయ్య(CM Sidda Ramaiah) స్పష్టం చేశారు. రుణభారం లేకుండా ఐదు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. శనివారం సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక విధానసౌధలో తొలి కేబినెట్‌ సమావేశం జరి పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్యారంటీ పథకాలకు ఎంత అవసర మో వాటిని బేరీజు వేస్తున్నామన్నారు. రూపురేఖలు లెక్కించాక సమగ్ర వివరాలు తెలుపుతామన్నారు. ఐదు గ్యారంటీలకు 50వేల కోట్లు ఖర్చు కానుందన్నారు. గృహ జ్యోతి పథకానికి నెలకు కనీసం రూ.1200కోట్లు అవసరం కానుందన్నారు. రానున్న కేబినెట్‌ సమావేశంలో పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీసేలా అమలు చేయమన్నారు. జూలైలో రూ.3.25లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడతానన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తామ న్నారు. కాగా ఇదే సందర్భంలో కేంద్రప్రభుత్వంపై సిద్దరామయ్య మండిపడ్డారు. 15వ ఆర్థిక కమిషన్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా గ్రాంట్లు విడుదల కాలేదన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం బాధ్యతలేకుండా వ్యవహరించిందన్నారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.5,492 కోట్లు ఇంకా రాలేదన్నారు. మీడియ సమావేశంలో డీసీఎం డీకే శివకుమార్‌, మంత్రులు పాల్గొ న్నారు. కాగా సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముందు గానే రాష్ట్ర ఆర్థిక విభాగం ఉన్నతాధికారులతో ఆయన నివాసంలో సమావేశమ య్యారు. ఆర్థికశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి ఐఎన్‌ఎస్‌ ప్రసాద్‌, కార్యదర్శులు జాఫర్‌, రూప్‌కౌర్‌లతో సమీక్ష జరిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు.

Updated Date - 2023-05-21T11:52:02+05:30 IST